Ravindra Jadeja: టీ20లీగ్‌ నుంచి జడేజా ఔట్‌

చెన్నై ఆల్‌రౌండర్‌ జడేజా గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా జడేజాకు పక్కటెముకల గాయమైంది. దిల్లీతో మ్యాచ్‌లో అతడు ఆడలేదు. ‘‘జడేజాకు పక్కటెముకల గాయమైంది.

Updated : 12 May 2022 06:44 IST

ముంబయి: చెన్నై ఆల్‌రౌండర్‌ జడేజా గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా జడేజాకు పక్కటెముకల గాయమైంది. దిల్లీతో మ్యాచ్‌లో అతడు ఆడలేదు. ‘‘జడేజాకు పక్కటెముకల గాయమైంది. దీంతో అతడు టీ20 లీగ్‌ను వీడితేనే బాగుంటుందని మేం నిర్ణయించాం’’ అని చెన్నై ముఖ్య కార్యనిర్వహణ అధికారి కాశీ విశ్వనాథన్‌ చెప్పాడు. ఇప్పటికే అతడు ఇంటికి వెళ్లిపోయాడని తెలిపాడు. చెన్నై ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచినా ప్లేఆఫ్స్‌ చేరడం చాలా కష్టమే. ఈ సీజన్‌కు చెన్నై కెప్టెన్‌గా నియమితుడైన జడేజా.. అర్ధంతరంగా బాధ్యతల నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఎనిమిది మ్యాచ్‌ల్లో అతడు జట్టుకు నాయకత్వం వహించాడు. ఇది అతడికి మరిచిపోదగ్గ సీజనే. ఫామ్‌లో లేని అతడు 10 మ్యాచ్‌ల్లో 116 పరుగులే చేశాడు. అయిదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే గాయం వల్ల జడేజా ఐపీఎల్‌ను వీడాడని చెబుతున్నప్పటికీ.. అతణ్ని జట్టు నుంచి తప్పించారన్న ఊహాగానాలూ సాగుతున్నాయి. ‘‘ఈ వ్యవహారంలో తెలియాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. జడేజా ఇన్‌స్టాగ్రామ్‌లో చెన్నైను అన్‌ఫాలో చేశాడు కూడా’’ అని ఓ టీ20 లీగ్‌ అధికారి వ్యాఖ్యానించాడు. అన్‌ఫాలో గురించి విశ్వనాథన్‌ను అడిగినప్పుడు.. ‘‘ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ గురించి నాకేమీ తెలియదు. ఈ విషయాలు గురించి మీకు నేనేమీ చెప్పలేను’’ అని అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని