ముగిసిన ప్రఫుల్‌ పటేల్‌ కథ

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)ను నడిపించడానికి సుప్రీంకోర్టు బుధవారం పాలకుల కమిటీ (సీఓఏ)ను నియమించింది. దీంతో పదవీకాలానికి మించి రెండేళ్లు అధికారంలో కొనసాగిన అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కథ ముగిసింది.

Published : 19 May 2022 02:06 IST

ఏఐఎఫ్‌ఎఫ్‌కు పాలకుల కమిటీ

దిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)ను నడిపించడానికి సుప్రీంకోర్టు బుధవారం పాలకుల కమిటీ (సీఓఏ)ను నియమించింది. దీంతో పదవీకాలానికి మించి రెండేళ్లు అధికారంలో కొనసాగిన అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కథ ముగిసింది. పాలకుల కమిటీకి విశ్రాంతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనిల్‌ ఆర్‌ దవే నాయకత్వం వహిస్తారు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఖురేషీ, భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ భాస్కర్‌ గంగూలీ కమిటీలోని ఇతర సభ్యులు. జాతీయ క్రీడా నియమావళిని అనుసరించి రూపొందించిన ఏఐఎఫ్‌ఎఫ్‌ నూతన రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఆమోదించాల్సివుంది. కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగి, కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు సీఓఏ.. ఫుట్‌బాల్‌ సమాఖ్య వ్యవహరాలు చూస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని