మెరిసిన భారత ఆర్చర్లు

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-2 టోర్నీలో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. పురుషుల కాంపౌండ్‌ జట్టు కనీసం రజతం ఖాయం చేసుకోగా.. మహిళల కాంపౌండ్‌ జట్టు కాంస్య పతకం సాధించింది.

Published : 19 May 2022 02:06 IST

గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-2 టోర్నీలో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. పురుషుల కాంపౌండ్‌ జట్టు కనీసం రజతం ఖాయం చేసుకోగా.. మహిళల కాంపౌండ్‌ జట్టు కాంస్య పతకం సాధించింది. అభిషేక్‌వర్మ, అమన్‌ సైని, రజత్‌ చౌహాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్‌ షూటాఫ్‌లో భారత్‌ 233-233 (29-26)తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. అంతకుముందు క్వార్టర్స్‌లో భారత్‌ 234-228తో అమెరికాపై గెలిచింది. ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ ఫ్రాన్స్‌తో భారత్‌ తలపడుతుంది. మహిళల కాంపౌండ్‌ సెమీస్‌లో అవనీత్‌ కౌర్‌, ముస్కార్‌ కిరార్‌, ప్రియా గుర్జర్‌లతో కూడిన భారత జట్టు 2 పాయింట్ల తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్‌ 232-231తో టర్కీపై విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని