జూనియర్‌ హాకీ సారథిగా వైష్ణవి

అయిదు దేశాల అండర్‌-23 మహిళల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జూనియర్‌ జట్టుకు వైష్ణవి ఫాల్కే సారథ్యం వహించనుంది.

Published : 26 May 2022 02:09 IST

దిల్లీ: అయిదు దేశాల అండర్‌-23 మహిళల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జూనియర్‌ జట్టుకు వైష్ణవి ఫాల్కే సారథ్యం వహించనుంది. జూన్‌ 19 నుంచి 26 వరకు ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జరుగనున్న ఈ టోర్నీ కోసం బుధవారం హాకీ ఇండియా (హెచ్‌ఐ) 20 మంది క్రీడాకారిణులతో జట్టును ప్రకటించింది. ముంతాజ్‌ఖాన్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌, అమెరికా, ఉక్రెయిన్‌ జట్లు బరిలో ఉన్నాయి.

జట్టు: గోల్‌కీపర్లు: ఖుష్బూ, కూర్మపు రమ్య; డిఫెండర్లు: ప్రీతి, మమిత ఒరమ్‌, మహిమ టెటె, నీలం, హృతిక సింగ్‌; మిడ్‌ఫీల్డర్లు: మంజు చౌరాసియా, వైష్ణవి ఫాల్కే (కెప్టెన్‌), జ్యోతి ఛాత్రి, హీనా బానో, నికిత టోపో, అశ్విని కోలేకర్‌, రుతజ పిసల్‌; ఫార్వర్డ్‌లు: అన్ను, బ్యూటీ డుంగ్‌డుంగ్‌, ముంతాజ్‌ఖాన్‌ (వైస్‌ కెప్టెన్‌), దీపిక సోరెంగ్‌, మోనిక టోపో, ముదుగుల భవాని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని