Shoaib Akhtar: సచిన్‌ను గాయపరచాలనుకున్నా: అక్తర్‌

భారత క్రికెట్‌ జట్టు 2006లో పాకిస్థాన్‌ పర్యటించినప్పుడు స్టార్‌ బ్యాటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ను ఎలాగైనా గాయపరచాలని ప్రయత్నించినట్లు రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ చెప్పాడు. ‘‘ఒక విషయాన్ని బహిర్గతం చేయాల

Updated : 07 Jun 2022 08:51 IST

కరాచి: భారత క్రికెట్‌ జట్టు 2006లో పాకిస్థాన్‌ పర్యటించినప్పుడు స్టార్‌ బ్యాటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ను ఎలాగైనా గాయపరచాలని ప్రయత్నించినట్లు రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ చెప్పాడు. ‘‘ఒక విషయాన్ని బహిర్గతం చేయాలనుకుంటున్నా. 2006లో భారత్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు కావాలనే సచిన్‌కు బంతి తగిలేలా వేయాలని అనుకున్నా. వికెట్లకు నేరుగా బంతి విసరాలని కెప్టెన్‌ ఇంజమాముల్‌ హక్‌ పదే పదే చెప్పాడు. నేను మాత్రం సచిన్‌ శరీరాన్ని లక్ష్యంగా చేసుకునే బౌలింగ్‌ చేశా. ఎందుకంటే అతడికి గాయమైతే త్వరగా పెవిలియన్‌ చేరతాడనేది నా వ్యూహం. ఆ ఎత్తుగడ ఫలించినట్లే అనిపించింది. సచిన్‌ హెల్మెట్‌కు ఓ బంతి బలంగా తాకింది. కానీ తెందుల్కర్‌పై ఆ దెబ్బ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత కూడా అతడికి గాయం చేసేందుకు ప్రయత్నించా. కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే మరోవైపు అసిఫ్‌ భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు. ఆ రోజు అసిఫ్‌ బంతులు వేసినట్లు ఎవరూ వేయలేరేమో అనేంతగా అతడు బౌలింగ్‌ చేశాడు’’ అని అక్తర్‌ గుర్తు చేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని