రాణి లేకుండానే..

భారత హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ కామన్వెల్త్‌ క్రీడలకు కూడా దూరమైంది. ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో ఇప్పటికే ప్రపంచకప్‌కు దూరమైన ఈ స్టార్‌ స్ట్రైకర్‌.. జులై 28న బర్మింగ్‌హామ్‌లో మొదలయ్యే కామన్వెల్త్‌ క్రీడల్లో బరిలో దిగే అవకాశాన్ని కోల్పోయింది.

Published : 24 Jun 2022 01:51 IST
కామన్వెల్త్‌కు భారత్‌
రజనీకి స్థానం

దిల్లీ: భారత హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌ కామన్వెల్త్‌ క్రీడలకు కూడా దూరమైంది. ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో ఇప్పటికే ప్రపంచకప్‌కు దూరమైన ఈ స్టార్‌ స్ట్రైకర్‌.. జులై 28న బర్మింగ్‌హామ్‌లో మొదలయ్యే కామన్వెల్త్‌ క్రీడల్లో బరిలో దిగే అవకాశాన్ని కోల్పోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టుకు రాణి సారథిగా వ్యవహరించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు గోల్‌కీపర్‌ సవిత పునియా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఒకటి రెండు మార్పులు మినహాయించి ప్రపంచకప్‌కు.. కామన్వెల్త్‌కు సెలెక్టర్లు దాదాపు ఒకే జట్టును ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు అదనపు గోల్‌కీపర్‌గా బిచూదేవి ఎంపిక కాగా.. కామన్వెల్త్‌ జట్టులో తెలుగమ్మాయి యతిమరుపు రజని చోటు సంపాదించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో పూల్‌-ఏలో ఇంగ్లాండ్‌, కెనడా, వేల్స్‌, ఘనాతో కలిసి ఉన్న భారత్‌.. తన తొలి మ్యాచ్‌లో జులై 29న ఘనాతో తలపడనుంది.

కామన్వెల్త్‌కు భారత జట్టు: సవిత పునియా (కెప్టెన్‌), దీప్‌ గ్రేస్‌ (వైస్‌ కెప్టెన్‌), యతిమరపు రజని, గుర్జీత్‌ కౌర్‌, నిక్కి ప్రధాన్‌, ఉదిత, నిషా, సుశీల చాను, మౌనిక, నేహా, జ్యోతి, నవ్‌జ్యోత్‌ కౌర్‌, సలీమా, వందన కటారియా, లాల్‌రెమ్‌సియామి, నవ్‌నీత్‌ కౌర్‌, షర్మిల దేవి, సంగీత కుమారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని