హాకీ దిగ్గజం వరీందర్‌ మృతి

ఒలింపిక్స్‌, ప్రపంచకప్‌ పతక విజేత.. హాకీ దిగ్గజం వరీందర్‌ సింగ్‌ (75) ఇకలేరు. 1970ల్లో భారత చిరస్మరణీయ విజయాల్లో భాగమైన వరీందర్‌ మంగళవారం ఉదయం జలంధర్‌లో తుదిశ్వాస విడిచారు.

Published : 29 Jun 2022 02:38 IST

దిల్లీ: ఒలింపిక్స్‌, ప్రపంచకప్‌ పతక విజేత.. హాకీ దిగ్గజం వరీందర్‌ సింగ్‌ (75) ఇకలేరు. 1970ల్లో భారత చిరస్మరణీయ విజయాల్లో భాగమైన వరీందర్‌ మంగళవారం ఉదయం జలంధర్‌లో తుదిశ్వాస విడిచారు. 1975 కౌలాలంపూర్‌ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు. ఫైనల్లో 2-1తో పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్‌కు ప్రతిష్టాత్మక టోర్నీలో ఇదే ఏకైక స్వర్ణ పతకం. 1972 మ్యూనిక్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం, 1973 ఆమ్‌స్టర్‌డామ్‌ ప్రపంచకప్‌లో రజతం సాధించిన భారత జట్టుకు వరీందర్‌ ప్రాతినిధ్యం వహించాడు. 1974, 1978 ఆసియా క్రీడల్లో రజతాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడు కూడా. 1975 మాంట్రియల్‌ ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నాడు. 2007లో వరీందర్‌కు ధ్యాన్‌చంద్‌ జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. వరీందర్‌ మృతిపట్ల హాకీ ఇండియా సంతాపం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని