- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Chess Olympaid: అగ్రస్థానంలోనే అమ్మాయిలు
చెస్ ఒలింపియాడ్
మహాబలిపురం: చెస్ ఒలింపియాడ్‌లో ఏడో రౌండ్లో భారత జట్లకు మెరుగైన ఫలితాలే దక్కాయి. మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సభ్యులైన భారత్-1 జట్టు చక్కటి ప్రదర్శనను కొనసాగిస్తూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. శుక్రవారం ఈ బృందం 2.5-1.5తో అజర్‌బైజాన్‌ను ఓడించింది. హంపి.. మమంజాదా చేతిలో ఓటమి పాలైనప్పటికీ.. ఉల్వియాపై తానియా సచ్‌దేవ్, గోహర్‌పై వైశాలి విజయాలు సాధించడం.. ఖనిమ్‌తో గేమ్‌ను హారిక డ్రాగా ముగించడంతో భారత్ పైచేయి సాధించింది. భారత్-3 జట్టు 3-1తో స్విట్జర్లాండ్‌పై నెగ్గింది. తెలుగమ్మాయి బొడ్డా ప్రత్యూషతో పాటు విశ్వ తమ గేమ్‌లను డ్రా చేసుకోగా.. ఈషా కరవాడె, నందిదా విజయాలు సాధించారు. భారత్-2 బృందం 1.5-2.5 తేడాతో గ్రీస్ చేతిలో ఓడింది. దివ్య దేశ్‌ముఖ్ మాత్రమే నెగ్గగా.. మేరీఆన్‌గోమ్స్ డ్రా చేసుకుంది. వంతిక, సౌమ్య ఓటమి పాలయ్యారు. భారత్-3, 2 జట్లు వరుసగా 11, 31 స్థానాల్లో ఉన్నాయి. పురుషుల విభాగంలో ఏడో రౌండ్లో భారత్-1, 3 జట్ల మధ్య పోరు సాగింది. ఇందులో భారత్-1 3-1తో విజయం సాధించింది. హరికృష్ణ-సూర్యశేఖర్, విదిత్-సేతురామన్ గేమ్‌లు డ్రా కాగా.. అభిజిత్‌పై అర్జున్, అభిమన్యుపై నారాయణన్ నెగ్గారు. భారత్-2 జట్టు 3.5-0.5తో క్యూబాను ఓడించింది. గుకేశ్, సరీన్, ప్రజ్ఞానంద విజయాలు సాధించగా.. అధిబన్ తన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. అర్మేనియా, అమెరికా తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్-2, 1 జట్లు వరుసగా 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
Sports News
Asia Cup : ఆసియా కప్ నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ అవకాశాలు..!
-
Politics News
Telangana News: అసహనంతో భాజపా నాయకులపై దాడులు: తెరాసపై ఈటల ఆగ్రహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
-
India News
Nitish kumar: 10లక్షలు కాదు.. 20లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: నీతీశ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Bihar: జీవిత ఖైదు అనుభవిస్తున్న నేత.. ఇంట్లో కాలక్షేపం!
- Indian Army: సియాచిన్‌లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
- Putin: కిమ్‌కు పుతిన్ లేఖ.. ఏమన్నారంటే!
- NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
- Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
- Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
- Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- Crime News: బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి
- Anand Mahindra: జెండా ఎగురవేసేందుకు వృద్ధ జంట ప్రయాస.. ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ పోస్ట్
- Social Look: పారిస్ ప్రేమలో మెహరీన్.. ట్రెండ్ ఫాలో అయిన ప్రియా ప్రకాశ్!