దక్షిణాఫ్రికాదే టీ20 సిరీస్‌

ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో చేజిక్కించుకుంది. రెండో టీ20లో 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రీజా హెండ్రిక్స్‌ (42), క్లాసెన్‌ (39), మిల్లర్‌ (32 నాటౌట్‌) మెరవడంతో మొదట దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఛేదనలో తడబడ్డ

Published : 07 Aug 2022 04:49 IST

బ్రిస్టల్‌: ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో చేజిక్కించుకుంది. రెండో టీ20లో 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రీజా హెండ్రిక్స్‌ (42), క్లాసెన్‌ (39), మిల్లర్‌ (32 నాటౌట్‌) మెరవడంతో మొదట దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. ఛేదనలో తడబడ్డ ఐర్లాండ్‌ 18.5 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. టెక్టార్‌ (34) టాప్‌ స్కోరర్‌. పార్నెల్‌ (5/30), ప్రిటోరియస్‌ (3/33) ఐర్లాండ్‌ను దెబ్బతీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని