CWG 2022: శ్రీలంక క్రీడాకారులు అదృశ్యం!

కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన 10 మంది శ్రీలంక క్రీడాకారులు అనుమానాస్పద రీతిలో అదృశ్యమయ్యారు. బ్రిటన్‌లో ఉండిపోయేందుకే వారు ఇలా చేసి ఉంటారని శ్రీలంక అధికారులు అనుమానిస్తున్నారు. వారి వారి ఈవెంట్లు పూర్తికాగానే

Updated : 15 Aug 2022 14:19 IST

దిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన 10 మంది శ్రీలంక క్రీడాకారులు అనుమానాస్పద రీతిలో అదృశ్యమయ్యారు. బ్రిటన్‌లో ఉండిపోయేందుకే వారు ఇలా చేసి ఉంటారని శ్రీలంక అధికారులు అనుమానిస్తున్నారు. వారి వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిది మంది అథ్లెట్లు, ఒక మేనేజర్‌ అదృశ్యమైనట్లు శ్రీలంకకు చెందిన ఓ క్రీడా అధికారి ఆదివారం వెల్లడించాడు. అందులో ఓ ముగ్గురు గత వారమే అదృశ్యమయ్యారని, ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు. అప్పటి నుంచి మరో ఏడుగురు కనిపించకుండా పోయారని తెలిపాడు. అయితే అదృశ్యమైన మొదటి ముగ్గురిని బ్రిటన్‌ పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురు స్థానిక చట్టాలను ఉల్లంఘించనందున, పైగా ఆరు నెలలపాటు చెల్లుబాటయ్యే వీసాలు కలిగి ఉన్నందున వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అయితే వారు ఎక్కడున్నారో పోలీసులు తమకు తెలపలేదని శ్రీలంక అధికారులు చెప్పారు. గతంలోనూ ఆయా అంతర్జాతీయ క్రీడా పోటీల నుంచి శ్రీలంక క్రీడాకారులు మాయమైన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న నేపథ్యంలో క్రీడాకారులు అదృశ్యం కావడం గమనార్హం. మొత్తం 160 మందితో  కూడిన శ్రీలంక బృందం బ్రిటన్‌కు వెళ్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని