పుజారా మరో మెరుపు శతకం

రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో భారత టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్‌ పుజారా వరుసగా రెండో మెరుపు సెంచరీ బాదాడు. ససెక్స్‌ తరఫున ఆడుతున్న ఈ భారత స్టార్‌.. ఆదివారం సర్రేపై 131 బంతుల్లో 174 పరుగులు చేశాడు.

Published : 15 Aug 2022 02:56 IST

హోవ్‌: రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో భారత టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్‌ పుజారా వరుసగా రెండో మెరుపు సెంచరీ బాదాడు. ససెక్స్‌ తరఫున ఆడుతున్న ఈ భారత స్టార్‌.. ఆదివారం సర్రేపై 131 బంతుల్లో 174 పరుగులు చేశాడు. ఇందులో 20 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన ససెక్స్‌.. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్‌ టామ్‌ క్లార్క్‌ (104)తో కలిసి మూడో వికెట్‌కు చెతేశ్వర్‌ 205 పరుగులు జోడించాడు. 103 బంతుల్లో సెంచరీ చేసిన అతడు... ఆ తర్వాత 28 బంతుల్లోనే 74 పరుగులు రాబట్టాడు. పుజారా, టామ్‌ శతకాలతో ససెక్స్‌ 50 ఓవర్లలో 378/6 స్కోరు చేసింది. ఇంతకుముందు మ్యాచ్‌లో వార్విక్‌షైర్‌పై పుజారా 79 బంతుల్లోనే 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని