ఆసియా కప్‌లో ఆ కోహ్లీని చూస్తాం

ఆసియా కప్‌ టీ20 టోర్నీలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌ను అందుకుంటాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2019 నవంబరు తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించని కోహ్లి..

Published : 17 Aug 2022 03:13 IST

దిల్లీ: ఆసియా కప్‌ టీ20 టోర్నీలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌ను అందుకుంటాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2019 నవంబరు తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించని కోహ్లి.. ఆసియా కప్‌లో సత్తా చాటుతాడని గంగూలీ అన్నాడు. ‘‘కోహ్లీని సాధన చేయనివ్వండి. మ్యాచ్‌లు ఆడనివ్వండి. అతనో గొప్ప ఆటగాడు. ఎన్నో పరుగులు సాధించాడు. అతను త్వరలోనే పుంజుకుంటాడని భావిస్తున్నా. కోహ్లి సెంచరీ మాత్రమే చేయలేకపోతున్నాడు. ఆసియా కప్‌లో ఒకప్పటి కోహ్లీని చూస్తామని, అతను ఫామ్‌ను దొరకబుచ్చుకుంటాడని నమ్ముతున్నా’’ అని గంగూలీ తెలిపాడు. ఈనెల 27న ఆసియా కప్‌ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని