కోల్‌కతా కోచ్‌గా చంద్రకాంత్‌ పండిత్‌

రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ను విజేతగా నిలిపిన భారత స్టార్‌ దేశవాళీ కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌ ఐపీఎల్‌లో కనిపించనున్నాడు. వచ్చే సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చంద్రకాంత్‌ చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లాండ్‌ టెస్టు జట్టుకు ప్రధాన

Published : 18 Aug 2022 02:18 IST

దిల్లీ: రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ను విజేతగా నిలిపిన భారత స్టార్‌ దేశవాళీ కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌ ఐపీఎల్‌లో కనిపించనున్నాడు. వచ్చే సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చంద్రకాంత్‌ చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లాండ్‌ టెస్టు జట్టుకు ప్రధాన కోచ్‌గా వెళ్లిన బ్రెండన్‌ మెక్‌కలమ్‌ స్థానంలో పండిత్‌ను నియమించినట్లు బుధవారం కోల్‌కతా ఫ్రాంచైజీ ప్రకటించింది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ను ఛాంపియన్‌గా నిలిపిన అతడు.. గతంలో ముంబయి, విదర్భలకు పలుమార్లు టైటిళ్లు అందించాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతాలు చేస్తున్న చంద్రకాంత్‌కు అత్యున్నత స్థాయిలో ఇదే మొదటి అవకాశం. ‘‘మా ప్రయాణంలో తర్వాతి దశలో మమ్మల్ని నడిపించడానికి నైట్‌రైడర్స్‌ కుటుంబంలో చందు చేరడం ఉత్సాహాన్నిస్తోంది. చందు పనితీరులో నిబద్ధత, దేశవాళీ క్రికెట్లో విజయాల రికార్డు అందరికీ తెలిసిందే. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో అతని భాగస్వామ్యం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని కేకేఆర్‌ సీఈఓ వెంకీ మైసూర్‌ తెలిపాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని