రోహిత్‌ తాపీగా ఉంటాడు

రోహిత్‌ శర్మ కాస్త తాపీగా ఉండే కెప్టెనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ‘‘రోహిత్‌ కెప్టెన్‌గా కాస్త తాపీగా ఉంటాడు. ఏ సమయంలోనైనా ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఎప్పుడూ ప్రత్యర్థుల ముఖాల్లోకి చూస్తూ దూకుడుగా

Published : 18 Aug 2022 02:37 IST

కోల్‌కతా: రోహిత్‌ శర్మ కాస్త తాపీగా ఉండే కెప్టెనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. ‘‘రోహిత్‌ కెప్టెన్‌గా కాస్త తాపీగా ఉంటాడు. ఏ సమయంలోనైనా ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఎప్పుడూ ప్రత్యర్థుల ముఖాల్లోకి చూస్తూ దూకుడుగా ఉండడు. గత కొన్నేళ్లలో టీమ్‌ఇండియాకు గొప్ప కెప్టెన్లు వచ్చారు. సంధి కాలంలో జట్టును ధోని అద్భుతంగా నడిపించాడు. భారత జట్టుకే కాదు.. తన ఫ్రాంఛైజీకీ అతడు అసాధారణ విజయాలు అందించాడు. విరాట్‌ కోహ్లికి కూడా కెప్టెన్‌గా అద్భుత రికార్డు ఉంది. అతడు భిన్నమైన కెప్టెన్‌. ప్రతి ఒక్కరికీ భిన్నమైన శైలి ఉంటుంది. అంతిమంగా ఎన్ని విజయాలు సాధించారన్నదే ముఖ్యం’’ అని గంగూలీ అన్నాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని