చరిత్ర సృష్టించిన మనీషా

భారత ఫుట్‌బాల్‌లో యువ స్ట్రైకర్‌ మనీషా కల్యాణ్‌ సరిచరిత్ర సృష్టించింది. యూఈఎఫ్‌ఏ మహిళల ఛాంపియన్స్‌ లీగ్‌లో బరిలో దిగిన తొలి భారత ఫుట్‌బాలర్‌గా రికార్డు నెలకొల్పింది. సైప్రస్‌లో జరుగుతున్న ఐరోపా క్లబ్‌ పోటీల్లో అపోలాన్‌ లేడీస్‌ ఎఫ్‌సీ తరఫున మనీషా బరిలో దిగింది. ఈ మ్యాచ్‌లో అపోలాన్‌ ఎఫ్‌సీ 3-0తో ఎస్‌ఎఫ్‌కే రిగాపై విజయం సాధించింది.

Published : 20 Aug 2022 02:33 IST

దిల్లీ: భారత ఫుట్‌బాల్‌లో యువ స్ట్రైకర్‌ మనీషా కల్యాణ్‌ సరిచరిత్ర సృష్టించింది. యూఈఎఫ్‌ఏ మహిళల ఛాంపియన్స్‌ లీగ్‌లో బరిలో దిగిన తొలి భారత ఫుట్‌బాలర్‌గా రికార్డు నెలకొల్పింది. సైప్రస్‌లో జరుగుతున్న ఐరోపా క్లబ్‌ పోటీల్లో అపోలాన్‌ లేడీస్‌ ఎఫ్‌సీ తరఫున మనీషా బరిలో దిగింది. ఈ మ్యాచ్‌లో అపోలాన్‌ ఎఫ్‌సీ 3-0తో ఎస్‌ఎఫ్‌కే రిగాపై విజయం సాధించింది. 60వ నిమిషంలో మరిలెనా జార్జియో స్థానంలో 20 ఏళ్ల మనీషా మైదానంలో అడుగుపెట్టింది. విదేశీ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న భారత నాలుగో మహిళా ఫుట్‌బాలర్‌ మనీషా. భారత జట్టు, ఇండియన్‌ ఉమెన్స్‌ లీగ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న మనీషాకు విదేశీ క్లబ్‌కు ఆడే అవకాశం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని