యశస్వి రికార్డు ద్విశతకం

ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (209 బ్యాటింగ్‌; 244 బంతుల్లో 23×4, 3×6) అజేయ ద్విశతకంతో అదరగొట్టడంతో సౌత్‌జోన్‌తో దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్‌జోన్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు, శుక్రవారం ఆట చివరికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 376 పరుగులు చేసింది. 

Published : 24 Sep 2022 03:15 IST

 పటిష్ట స్థితిలో వెస్ట్‌జోన్‌

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌

కొయంబత్తూర్‌: ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (209 బ్యాటింగ్‌; 244 బంతుల్లో 23×4, 3×6) అజేయ ద్విశతకంతో అదరగొట్టడంతో సౌత్‌జోన్‌తో దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్‌జోన్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు, శుక్రవారం ఆట చివరికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 376 పరుగులు చేసింది.  శ్రేయస్‌ (71) రాణించాడు. యశస్వి, సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (30 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో ఒక టోర్నీ ఫైనల్లో డబుల్‌ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా వాడేకర్‌ (20 ఏళ్ల 354 రోజులు) పేరిట ఉన్న రికార్డును జైస్వాల్‌ (20 ఏళ్ల 269 రోజులు) బద్దలు కొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 318/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌత్‌జోన్‌ 327కే ఆలౌటై 57 పరుగుల ఆధిక్యానికి పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్‌జోన్‌ 270 పరుగులకే ఆలౌటైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని