98కే కుప్పకూలిన సౌరాష్ట్ర

ఇరానీ ట్రోఫీలో తొలి రోజే రెస్టాఫ్‌ ఇండియా పట్టుబిగించింది. శనివారం టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర.. ముకేశ్‌ కుమార్‌ (4/23), కుల్‌దీప్‌ సేన్‌ (3/41), ఉమ్రాన్‌ మాలిక్‌ (3/25) ధాటికి విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 24.5 ఓవర్లలో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది.

Published : 02 Oct 2022 02:36 IST

ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌
సర్ఫ్‌రాజ్‌ సెంచరీ
రెస్టాఫ్‌ ఇండియా 205/3

రాజ్‌కోట్‌: ఇరానీ ట్రోఫీలో తొలి రోజే రెస్టాఫ్‌ ఇండియా పట్టుబిగించింది. శనివారం టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర.. ముకేశ్‌ కుమార్‌ (4/23), కుల్‌దీప్‌ సేన్‌ (3/41), ఉమ్రాన్‌ మాలిక్‌ (3/25) ధాటికి విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో 24.5 ఓవర్లలో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. 5 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ధర్మేంద్ర జడేజా (28) టాప్‌ స్కోరర్‌. అర్పిత్‌ వసవాడ 22 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రెస్టాఫ్‌ ఇండియా.. సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (125 నాటౌట్‌; 126 బంతుల్లో 19×4, 2×6) సెంచరీ కొట్టడంతో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓ దశలో 18 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకున్న రెస్ట్‌ను కెప్టెన్‌ హనుమ విహారి (62 నాటౌట్‌; 145 బంతుల్లో 9×4, 1×6)తో కలిసి సర్ఫరాజ్‌ ఆదుకున్నాడు. ఈ ఇద్దరు అభేద్యమైన నాలుగో వికెట్‌కు 187 పరుగులు జోడించారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts