జ్యోతికి స్వర్ణం

జాతీయ క్రీడల్లో తెలుగమ్మాయిలు జ్యోతి యర్రాజి (ఆంధ్రప్రదేశ్‌), అగసర నందిని (తెలంగాణ) సత్తాచాటారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ, రజత పతకాలతో మెరిశారు.

Published : 05 Oct 2022 02:55 IST

నందిని, రష్మిలకు రజతాలు

జాతీయ క్రీడలు

అహ్మదాబాద్‌: జాతీయ క్రీడల్లో తెలుగమ్మాయిలు జ్యోతి యర్రాజి (ఆంధ్రప్రదేశ్‌), అగసర నందిని (తెలంగాణ) సత్తాచాటారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ, రజత పతకాలతో మెరిశారు. మంగళవారం జరిగిన ఈ పరుగును జ్యోతి 12.79 సెకన్లలో ముగించి అగ్రస్థానం సాధించింది. 13.38 సెకన్లలో రేసును పూర్తిచేసిన నందిని ద్వితీయ స్థానంలో నిలిచింది. ద్రోణాచార్య నాగపురి రమేశ్‌ దగ్గర వీళ్లిద్దరూ శిక్షణ    తీసుకున్నారు. జాతీయ క్రీడల రికార్డును జ్యోతి తిరగరాసినా.. గాలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో టైమింగ్‌ను పరిగణలోకి తీసుకోలేదు. 13.04 సెకన్లతో జ్యోతి పేరిట జాతీయ రికార్డు ఉంది. ఇప్పటికే జ్యోతి 100మీ. పరుగులో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. మరో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ రష్మి కె.షెట్టి జావెలిన్‌ త్రో పోటీలో ఈటెను 53.95 మీ దూరం విసిరి రజత పతకాన్ని సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని