సాయిప్రణీత్‌కు స్వర్ణం

జాతీయ క్రీడల్లో తెలంగాణ జోరు కొనసాగుతోంది. గురువారం మూడు స్వర్ణ పతకాలతో సత్తాచాటింది. బ్యాడ్మింటన్‌లో భమిడిపాటి సాయిప్రణీత్‌, సిక్కిరెడ్డి- పుల్లెల గాయత్రి గోపీచంద్‌ జోడీ బంగారు పతకాలతో మెరిశారు.

Published : 07 Oct 2022 03:02 IST

సిక్కి- గాయత్రి జోడీకి పసిడి

ఈనాడు, హైదరాబాద్‌, విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: జాతీయ క్రీడల్లో తెలంగాణ జోరు కొనసాగుతోంది. గురువారం మూడు స్వర్ణ పతకాలతో సత్తాచాటింది. బ్యాడ్మింటన్‌లో భమిడిపాటి సాయిప్రణీత్‌, సిక్కిరెడ్డి- పుల్లెల గాయత్రి గోపీచంద్‌ జోడీ బంగారు పతకాలతో మెరిశారు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ 21-11, 12-21, 21-16తో మిథున్‌ మంజునాథ్‌ (కర్ణాటక)పై విజయం సాధించాడు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి- గాయత్రి జోడీ 21-14, 21-11తో శిఖ గౌతమ్‌- అశ్విని భట్‌ (కర్ణాటక) జంటపై గెలుపొందింది. బాస్కెట్‌బాల్‌ 3×3లో స్వర్ణం నెగ్గిన తెలంగాణ బాస్కెట్‌బాల్‌ జట్టు.. 5×5 విభాగంలోనూ పసిడి పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో తెలంగాణ 67-62తో తమిళనాడుపై విజయం సాధించింది. పుష్ప (23 పాయింట్లు), ప్రియాంక (14), అంబరాశి (13) తెలంగాణ విజయంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ స్విమ్మర్‌ వ్రితి మరో రెండు పతకాలు సాధించింది. మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో రజతం, 200 మీటర్ల బటర్‌ఫ్లై పోటీలో కాంస్యం నెగ్గింది. ఆర్చరీ కాంపౌండ్‌ మహిళల టీమ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు రజతం లభించింది. ఫైనల్లో సూర్యహంసిని, శరణ్య, షణ్ముఖి, నాగసాయిలత బృందం 222-229 తేడాతో  మహారాష్ట్ర చేతిలో పరాజయంపాలైంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని