పాక్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌

పాకిస్థాన్‌లో రాజకీయ అశాంతి.. అనిశ్చితి నడుమ ఇంగ్లాండ్‌ జట్టు ఆ దేశంలో అడుగుపెట్టింది.

Updated : 28 Nov 2022 04:34 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో రాజకీయ అశాంతి.. అనిశ్చితి నడుమ ఇంగ్లాండ్‌ జట్టు ఆ దేశంలో అడుగుపెట్టింది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం ఆదివారం ఉదయం ఇంగ్లాండ్‌ జట్టు పాక్‌ చేరుకుంది. 2005 తర్వాత పాక్‌లో ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ ఆడనుండటం ఇదే తొలిసారి. డిసెంబరు 1న రావల్పిండిలో ప్రారంభమయ్యే మొదటి టెస్టులో బెన్‌ స్టోక్స్‌ సారథ్యంలోని ఇంగ్లాండ్‌ బరిలో దిగుతుంది. 9 నుంచి 13 వరకు ముల్తాన్‌లో రెండో టెస్టు, 17 నుంచి 21 వరకు కరాచిలో మూడో టెస్టు జరుగుతాయి. పాక్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ భారీ నిరసనలకు పిలుపునివ్వడంతో టెస్టు సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ సిరీస్‌కు ఇబ్బంది కలిగించబోమని ఇమ్రాన్‌ హామీ ఇవ్వడంతో యథాతథంగా పర్యటన కొనసాగించాలని ఇంగ్లాండ్‌ నిర్ణయించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌కు ముందు పాక్‌లో ఏడు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 4-3తో కైవసం చేసుకుంది. నిరుడు యూఏఈలో టీ20 ప్రపంచకప్‌కు ముందు పాక్‌లో ఇంగ్లాండ్‌ పర్యటించాల్సింది. అయితే రావల్పిండి తొలి వన్డేలో టాస్‌కు కొన్ని నిమిషాల ముందు భద్రత కారణాలతో న్యూజిలాండ్‌ జట్టు తమ పర్యటనను రద్దు చేసుకుంది. దీంతో ఇంగ్లాండ్‌ కూడా పాక్‌ పర్యటనకు విముఖత చూపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని