ఫైనల్లో ఉన్నతి

ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల అండర్‌-17 విభాగంలో ఉన్నతి హుడా ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Published : 04 Dec 2022 03:10 IST

దిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల అండర్‌-17 విభాగంలో ఉన్నతి హుడా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆమె 21-8, 21-17తో యొకోచి (జపాన్‌)పై నెగ్గి ఆదివారం సరున్‌రాక్‌ (థాయ్‌లాండ్‌)తో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. ఈ విభాగం సింగిల్స్‌లో ఫైనల్‌ చేరిన భారత తొలి మహిళా షట్లర్‌ ఉన్నతినే. అండర్‌-17 విభాగంలో పురుషుల డబుల్స్‌లో ఇంతకుముందు అర్జున్‌-చిరాగ్‌ శెట్టి (2013), కృష్ణ ప్రసాద్‌-సాత్విక్‌ సాయిరాజ్‌ స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. అండర్‌-15 సింగిల్స్‌లో అనీష్‌ తుదిపోరులో అడుగుపెట్టాడు. సెమీస్‌లో అతడు 18-21, 21-12, 21-12తో లీయూ-జుయ్‌ (చైనీస్‌ తైపీ)ను ఓడించాడు. జ్ఞాన దత్తు 16-21, 21-19, 13-21తో లీయూ చేతిలో ఓడిపోయాడు. అండర్‌-17 బాలుర డబుల్స్‌ సెమీస్‌లో అర్ష్‌-సంస్కార్‌ 21-15, 21-19తో చిరుయ్‌-సివో హువా (చైనీస్‌ తైపీ)పై నెగ్గగా.. అండర్‌-15 బాలుర డబుల్స్‌ సెమీస్‌లో ఓడిన జైసన్‌-అతీష్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని