పొవార్‌ ఎన్‌సీఏకు

మరో రెండు నెలల్లో మహిళల టీ20 ప్రపంచకప్‌ జరుగనుండగా.. భారత జట్టు ప్రధాన కోచ్‌ రమేశ్‌ పొవార్‌పై బీసీసీఐ వేటువేసింది.

Published : 07 Dec 2022 01:54 IST

మహిళల బ్యాటింగ్‌ కోచ్‌గా కనిత్కర్‌

దిల్లీ: మరో రెండు నెలల్లో మహిళల టీ20 ప్రపంచకప్‌ జరుగనుండగా.. భారత జట్టు ప్రధాన కోచ్‌ రమేశ్‌ పొవార్‌పై బీసీసీఐ వేటువేసింది. మంగళవారం అతడిని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కి బదిలీ చేసింది. క్రికెట్‌ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఎన్‌సీఏలో పొవార్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తాడు. మహిళల చీఫ్‌ కోచ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోని బీసీసీఐ.. టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు హృషికేశ్‌ కనిత్కర్‌ను బ్యాటింగ్‌ శిక్షకుడిగా నియమించింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా కనిత్కర్‌ బాధ్యతలు స్వీకరిస్తాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు