WI vs IND: టీమ్‌ఇండియాలో నో ఛాన్స్‌.. ‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్‌తో ఉన్నాడు’

విండీస్‌ టూర్‌కు భారత జట్టులో చోటు దక్కకపోవడంపై పంజాబ్‌ కింగ్స్‌ వికెట్ కీపర్‌ జితేశ్ శర్మ (Jitesh Sharma) స్పందించాడు. 

Published : 10 Jul 2023 01:23 IST

ఇంటర్నెట్ డెస్క్: త్వరలో వెస్టిండీస్‌తో టీమ్‌ఇండియా (Team India) రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్న విషయం తెలిసిందే.  ఐపీఎల్‌లో అదరగొట్టిన  కొంతమంది భారత ఆటగాళ్లకు సెలక్టర్లు ఈ సిరీస్‌ల్లో అవకాశం కల్పించారు. యశస్వి జైస్వాల్, ముఖేశ్‌ కుమార్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లకు తొలిసారిగా టెస్టు జట్టులో అవకాశం కల్పించారు. ముఖేశ్ కుమార్‌, రుతురాజ్‌లను వన్డే జట్టులోనూ కొనసాగించాలని నిర్ణయించారు. తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్‌లను టీ20 జట్టులోకి తీసుకున్నారు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్ (కేకేఆర్‌) , ప్రభ్‌సిమ్రన్ సింగ్, జితేశ్ శర్మ (పంజాబ్‌)లను కూడా టీమ్‌ఇండియాకు ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, వారికి నిరాశే ఎదురైంది.

ఈ నేపథ్యంలో భారత జట్టులో చోటు దక్కకపోవడంపై పంజాబ్‌ కింగ్స్‌ వికెట్ కీపర్‌ జితేశ్ శర్మ (Jitesh Sharma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. విండీస్‌ టూర్‌కు ఎంపికకాకపోవడం గురించి ఏమనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్‌ వేశాడు’’ ఒక్క మాటలో సమాధానమిచ్చాడు. భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ‘‘నిజం చెప్పాలంటే.. భవిష్యత్‌ గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు. ఒక మనిషిగా నాకూ కొన్ని లక్ష్యాలుంటాయి. వాటిని సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నా.  ప్రస్తుతం నా దృష్టంతా ఫిట్‌నెస్‌, నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంపైనే ఉంది’’ అని జవాబిచ్చాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో జితేశ్‌ శర్మ 14 మ్యాచ్‌లు ఆడి 156.06 స్ట్రైక్‌రేట్‌తో 309 పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్‌ల్లో మంచి ఫినిషింగ్ టచ్‌ ఇచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని