Yuvraj Singh : రోహిత్‌ వర్సెస్‌ హార్దిక్‌ : ఆ ప్రచారంపై యువరాజ్‌ ఏమన్నాడంటే..?

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో హార్దిక్‌ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్‌ తరఫున రోహిత్‌ శర్మ ఆడతాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఇగో సమస్యలు తలెత్తుతాయా..? అన్న ప్రశ్నకు యువరాజ్‌ స్పందించాడు.

Updated : 14 Jan 2024 12:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబయి జట్టుకు మారి.. అనూహ్యంగా కెప్టెన్సీ స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆ జట్టును ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ.. వచ్చే సీజన్‌లో హార్దిక్‌ సారథ్యంలో ఆడాలి. మరి ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఇగో సమస్యలు తలెత్తుతాయా..? అనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. దీనిపై మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ స్పందించాడు.

India vs Afghanistan: సిరీస్‌ పట్టేయాలని

‘ఇద్దరు ఆటగాళ్లు కలిసి ఆడినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. వారికి ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా చర్చించుకోవాలి. అలాంటి సమస్య ఉన్నట్లు నాకైతే కనిపించడం లేదు. హార్దిక్‌ ముంబయి జట్టుకు ఆడినప్పుడు అతడి నుంచి ఉత్తమ ప్రదర్శన వెలికితీసేందుకు రోహిత్‌ కీలక ప్రాత పోషించాడు. హార్దిక్‌ గుజరాత్‌ జట్టుకు ఆడినప్పుడు నాలుగో స్థానంలో మంచి బ్యాటింగ్‌ ప్రదర్శన చేశాడు’’ అని యువీ పేర్కొన్నాడు.

వచ్చే టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో కెప్టెన్‌గా హార్దిక్‌కు అవకాశం ఇస్తారా..? అన్న ప్రశ్నకు యువీ స్పందిస్తూ.. అది అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందన్నాడు. ఇది సెలెక్టర్లు నిర్ణయించాల్సిన అంశమని పేర్కొన్నాడు. ‘రోహిత్‌ గొప్ప కెప్టెన్‌ అని నేను చెప్పగలను. ముంబయికి ఐదు ట్రోఫీలు అందించాడు. టీమ్‌ఇండియాను వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ వరకూ తీసుకెళ్లాడు. ఐపీఎల్‌, టీమ్‌ఇండియాకు లభించిన గొప్ప సారథుల్లో అతడు ఒకడు. హార్దిక్‌ ఫిట్‌నెస్‌ గురించి నాకు తెలియదు. అది సెలక్టర్ల నిర్ణయం’ అని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని