World Cup: వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్రధాన ఆయుధం అతడే: వసీమ్ అక్రమ్
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ వసీమ్ అక్రమ్ (Wasim Akram) భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya)పై ప్రశంసలు కురిపించాడు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్రధాన ఆయుధం అతడేనన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అదరగొట్టాడు. బంతితో, బ్యాటుతో రాణించి జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో (రద్దయిన మ్యాచ్) టాప్ ఆర్డర్ విఫలమైన వేళ ఇషాన్ కిషన్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 90 బంతుల్లో 87 పరుగులు చేసి సత్తా చాటాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ వసీమ్ అక్రమ్ (Wasim Akram) ప్రశంసలు కురిపించాడు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్రధాన ఆయుధం అతడేనన్నాడు. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోందని పేర్కొన్నాడు.‘‘రాబోయే ప్రపంచ కప్‌లో హార్దిక్ పాండ్య టీమ్‌ఇండియా ప్రధాన ఆయుధం. ఈ టోర్నీ టైటిల్ ఫేవరెట్లలో టీమ్‌ఇండియా ఒకటి. వారి స్వదేశంలో టోర్నీ జరగనుంది. ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ బౌలింగ్ సత్తా ఏంటో చూశాం. ఆసియా కప్‌లో కుల్‌దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పెద్ద జట్లపై కూడా వికెట్లు పడగొట్టాడు’’ అని వసీమ్ అక్రమ్ వివరించాడు.
‘రోహిత్‌కు అసలు సిసలు పరీక్ష ముందుంది.. ఏ మాత్రం తేడా వచ్చినా’
బుమ్రా గాయం నుంచి తిరిగి వచ్చినట్లు లేదు: ఆకాశ్ చోప్రా
టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వెన్నుగాయం కారణంగా సూమారు 11 నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పునరాగమనం చేసిన అతడు అదిరిపోయే బౌలింగ్‌తో మునుపటి బుమ్రాను గుర్తు చేసున్నాడు. ఆసియా కప్‌లోనూ సత్తాచాటాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ప్రశంసలు కురిపించాడు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, అతడు గాయం నుంచి కోలుకుని వచ్చినట్లు కనిపించడం లేదన్నాడు. ‘‘బుమ్రా 10 ఓవర్లు బౌలింగ్ చేయగలడా అని మేం ఆలోచించాం. అతనికి ఎక్కువసార్లు 10 ఓవర్లు వేయాల్సిన అవసరం రాలేదు. కానీ, వేసిన ఓవర్లలో మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాకైతే బుమ్రా గాయం నుంచి కోలుకుని వచ్చిన బౌలర్‌లా కనిపించడం లేదు. బంతిని రెండువైపులా స్వింగ్ చేస్తున్నాడు. మంచి పేస్, రిథమ్‌తో వైవిధ్యంగా బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా రాకతో జట్టు బలంగా మారింది’’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: ఫ్యాషన్ షోలో ఖుషి.. దివి స్టైలిష్ అవతార్
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!