Ravichandran Ashwin: వారికి బౌలింగ్‌ వేయడాన్ని ఎంతో ఇష్టపడతా : అశ్విన్‌

కెరీర్‌లో వందో టెస్టు ఆడనున్న రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin).. మైదానంలో తాను ఎదుర్కొన్న ఉత్తమ బ్యాటర్ల గురించి వివరించాడు.

Updated : 05 Mar 2024 20:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టెస్టుల్లో 500 వికెట్ల ఘనత అందుకున్న టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌.. 100వ టెస్టు ఆడబోతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఆఖరి టెస్టుతో అతడు   ఈ ఘనతను సాధించబోతున్నాడు. ఈనేపథ్యంలో మైదానంలో ఆస్వాదించిన ఘటనలను అతడు పంచుకున్నాడు.

‘స్టీవ్‌ స్మిత్‌, విలియమ్సన్‌. జోరూట్‌లకు బౌలింగ్‌ వేయడమంటే నాకెంతో ఇష్టం. ప్రపంచ క్రికెట్‌లో వీరు ప్రస్తుతం ఉత్తమ బ్యాటర్లు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడినప్పుడు.. కొంతమంది గొప్ప బ్యాటర్లకు బౌలింగ్‌ చేసే అవకాశం నాకు వచ్చింది. ఎస్‌.బద్రీనాథ్‌, మిథున్‌ మన్‌హస్‌, రజత్‌ భాటియాలకు బంతులు వేశాను. స్పిన్‌ ఆడటంలో దిగ్గజాలైన వీరిని అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదుర్కోకూడదని భావించాను. ఎన్నో విలువైన పాఠాలను నాకు నేర్పినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు.

బ్యాటర్లను రీడ్‌ చేస్తాడు.. : పుజారా

వందో టెస్టు ఆడనున్న అశ్విన్‌ను ప్రశంసించాడు పుజారా. ‘‘వేగవంతంగా 500 టెస్టు వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా అశ్విన్‌ నిలిచాడు. ఇప్పుడు అలాంటి మరో మైలు రాయికి చేరువలో ఉన్నాడు. అదే వందో టెస్టు. వివిధ కారణాల వల్ల అతడు ఇక్కడికి చేరుకోవడానికి కొంచెం ఆలస్యమైంది. సవాళ్లు స్వీకరించి.. జట్టు కోసం కష్టపడటానికి అతడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. నిజంగా ఈ ఘనతకు అర్హుడు’’

వందో టెస్టులో మెరిసేదెవరో!

‘‘అన్ని ఫార్మాట్లు ఆడుతున్నప్పటికీ.. సుదీర్ఘకాలం నిలదొక్కుకున్న ఆటగాడు అతడు. దానికి కారణం అతడి వినూత్న ఆలోచనా ధోరణి. కొత్త వాటిని ప్రయత్నించడానికి భయపడడు. ఏమాత్రం సిగ్గుపడడు. ఆ ప్రక్రియలో విఫలమైనా తన ప్రయత్నాలు ఆపడు. అశ్విన్‌ను ఎదుర్కొనే సమయంలో బ్యాటర్లకు ఎలాంటి ఉపశమనం లభించదు. ఎందుకంటే ప్రతిసారీ వికెట్‌ కోసమే ప్రయత్నిస్తాడు. బ్యాటర్లను అతడు రీడ్‌ చేస్తాడు. వారికంటే ఒక అడుగు ముందే ఉంటాడు. చిన్న క్లూ కూడా వదలడు. మీరు అతడి బౌలింగ్‌కు అలవాటు పడితే.. వెంటనే బంతిలో వేరియేషన్‌ చూపిస్తాడు’’ అని పుజారా కొనియాడాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు