T20 World Cup: సూపర్‌.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్‌

ఈ టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించేందుకు శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్లు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చి్ంది. అఫ్గానిస్థాన్‌ మాత్రం నేరుగా అర్హత సాధించింది. భారత్, న్యూజిలాండ్‌, పాకిస్థాన్ లాంటి పెద్ద జట్లు ఉన్న గ్రూపు-బిలో చోటు సంపాదించి

Updated : 31 Oct 2021 05:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించేందుకు శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్లు క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. అఫ్గానిస్థాన్‌ మాత్రం నేరుగా అర్హత సాధించింది. భారత్, న్యూజిలాండ్‌, పాకిస్థాన్ లాంటి పెద్ద జట్లు ఉన్న గ్రూపు-బిలో చోటు సంపాదించి తానేమీ పసికూనను కాదని ఇతర జట్లకు హెచ్చరిక పంపింది. స్కాట్లాండ్‌పై 130 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గట్టి పోటీని ఇచ్చి ఓడింది. పాక్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో అసిఫ్‌ అలీ నాలుగు సిక్స్‌లు బాదకుంటే మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుతం ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.. అఫ్గాన్‌ జట్టుపై  ట్విటర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురిపించాడు. అఫ్గానిస్థాన్‌ మెరుగ్గా ఆడుతోందని, ఆ జట్టుకు ఉజ్వలమైన భవిష్యత్‌ ఉందని కొనియాడాడు. 

‘పాకిస్థాన్‌ జట్టుకు శుభాభినందనలు. అఫ్గానిస్థాన్‌ అద్భుతమైన ప్రదర్శన చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఇంత వేగంగా ఎదిగి.. ఈ స్థాయిలో ప్రత్యర్థి జట్లకు సవాలు విసిరే జట్టును నేను ఇప్పటివరకు చూడలేదు. పోటీతత్వం, ప్రతిభ ఉన్న ఉన్న అఫ్గాన్‌ జట్టుకు మంచి భవిష్యత్‌ ఉంది’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్వీట్ చేశాడు. నవంబరు 3న అబుదాబి వేదికగా భారత్‌తో అఫ్గానిస్థాన్ తలపడనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని