అర్ధ శతకానికి ముందు రోహిత్‌ ఔట్‌

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(44; 74 బంతుల్లో 6x4)...

Updated : 16 Jan 2021 09:50 IST

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(44; 74 బంతుల్లో 6x4) ఔటయ్యాడు. లైయన్‌ వేసిన 20వ ఓవర్‌ ఐదో బంతికి గాల్లోకి షాట్‌ ఆడిన అతడు మిచెల్‌ స్టార్క్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అంతకుముందు శుభ్‌మన్‌గిల్‌(7) కమిన్స్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో స్మిత్‌ చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో పుజారా(7), అజింక్య రహానె ఉన్నారు. 20 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 60/2గా నమోదైంది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

 ఇవీ చదవండి..

అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా‌‌!

గబ్బా టెస్టు: ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 369  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని