Team India: టీమ్ఇండియా ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు జట్టు: షేన్ వార్న్
ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై 157 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో భారత జట్టుపై భారత మాజీ ఆటగాళ్లతోపాటు ఇతర దేశాల ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం
(Photo: BCCI Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌పై 157 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో భారత జట్టుపై భారత మాజీ ఆటగాళ్లతోపాటు ఇతర దేశాల ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కూడా టీమ్ఇండియాను ట్విటర్ వేదికగా ప్రశంసించాడు. ‘మరో అద్భుతమైన విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. గత 12 నెలలుగా మీరందరూ సాధించినది కచ్చితంగా అద్భుతమైనది. నిజంగా.. ప్రపంచంలో టీమ్ఇండియా అత్యుత్తమ టెస్టు జట్టు’ అని షేన్ వార్న్ ట్వీట్ చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైన టీమ్ఇండియా.. అనుహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుని 466 పరుగులు చేసి మంచి అధిక్యం సంపాదించింది. రోహిత్ శర్మ(127) శతకంతో అదరగొట్టగా..శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. మిగతా బౌలర్లు కూడా రెండో ఇన్నింగ్స్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్‌ని 210 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో టీమ్ఇండియా 157 పరుగులతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 అధిక్యంలో నిలిచింది. చివరి టెస్టు సెప్టెంబరు 10న మాంచెస్టర్ వేదికగా ప్రారంభంకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్‌లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్‌కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్‌పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్‌కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్‌ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.