Olympics: భారత అథ్లెట్లపై జపాన్‌ ఆంక్షలు

వచ్చే నెల జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లే భారత క్రీడాకారులపై జపాన్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రపంచ అతిపెద్ద క్రీడా సంగ్రామానికి వచ్చే భారత అథ్లెట్లు...

Published : 19 Jun 2021 21:19 IST

దిల్లీ: వచ్చే నెల జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లే భారత క్రీడాకారులపై జపాన్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రపంచ అతిపెద్ద క్రీడా సంగ్రామానికి వచ్చే భారత అథ్లెట్లు, కోచ్‌లు సహా ఇతర సిబ్బంది జపాన్‌ వెళ్లేముందు వారం ముందు ప్రతిరోజూ కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలని పేర్కొంది. టోక్యో చేరుకున్న అనంతరం కూడా మూడు రోజుల పాటు ఏ దేశ క్రీడాకారులనూ కలిసేందుకు వీల్లేదని స్పష్టంచేసింది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నందున భారత్‌ సహా 11 దేశాలపై ఇదే తరహా ఆంక్షలు విధించినట్లు జపాన్‌ వెల్లడించింది. జపాన్‌ విధించిన కొత్త ఆంక్షలపై భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. తాజా నిబంధనలు వివక్షపూరితంగా ఉన్నాయని ఐఓఏ ప్రెసిడెంట్‌  అధ్యక్షుడు నరేంద్ర బత్రా, సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా మండిపడ్డారు. ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఒలింపిక్స్‌కు ఐదు రోజుల ముందు మాత్రమే క్రీడా ప్రదేశానికి అనుమతించడాన్నీ తప్పుబట్టారు. ఇలాగైతే మూడు రోజుల పాటు ఆటగాళ్ల సమయం వృథా అవుతుందని అన్నారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని