Jasprit Bumrah: బాడీషేమింగ్‌ కామెంట్లు.. దీటుగా బదులిచ్చిన బుమ్రా సతీమణి

Jasprit Bumrah: పేసర్‌ బుమ్రా సతీమణి సంజనా గణేశన్‌ తన శరీరాకృతిపై నెట్టింట ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. వాటికి ఆమె గట్టిగా బదులిచ్చారు.

Updated : 13 Feb 2024 10:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) సతీమణి సంజనా గణేశన్‌ (Sanjana Ganesan) ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం తన ఇన్‌స్టా పేజీలో ఓ ప్రమోషన్ వీడియోను పోస్ట్‌ చేశారు. ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ చేసిన ప్రచార చిత్రంలో బుమ్రా దంపతులు నటించారు. అయితే, అందులో సంజన శరీరాకృతి (Body-Shaming)పై కొందరు నెటిజన్లు ట్రోలింగ్‌ చేశారు.

‘‘మీరు చాలా లావుగా ఉన్నారు’’ అంటూ ఓ నెటిజన్‌ అనుచిత కామెంట్‌ చేశాడు. దీనికి ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘సైన్స్‌ పుస్తకాల్లో మీరు చదువుకున్న విషయాలు గుర్తులేవా..? మహిళ శరీరాకృతిపై కామెంట్లు చేయడానికి మీకెంత ధైర్యం? వెళ్లిపో ఇక్కడి నుంచి..!’’ అని సంజనా బదులిచ్చారు. ఆమె సమాధానంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ‘సరిగ్గా చెప్పారు మేడం’ అని అభినందించారు.

‘విరాట్‌’ పర్వంలో విరామం.. కోహ్లీ ఎక్కడ?

ప్రముఖ స్పోర్ట్స్‌ యాంకర్‌ సంజనా గణేశన్‌ను బుమ్రా 2021 మార్చిలో వివాహం చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబరులో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ నుంచి చిన్న విరామం దొరకడంతో బుమ్రా ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నాడు. త్వరలోనే అతడు జట్టుతో చేరనున్నాడు.

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ గురువారం (ఫిబ్రవరి 15) నుంచి రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది. ఇప్పటికే చెరో పాయింట్‌తో ఇరు జట్లు స్కోర్‌ను సమం చేశాయి. రెండో టెస్టులో బుమ్రా 9 వికెట్లు పడగొట్టి టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని