Virat Kohli: కోహ్లి పూర్తిగా వదిలేస్తాడు.. ఎప్పుడంటే!: రవిశాస్త్రి

మానసికంగా అలసిపోయానని అనిపించినప్పుడు.. బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని కోరుకున్నప్పుడు విరాట్‌ కోహ్లి కెప్టెన్సీని పూర్తిగా వదిలిపెట్టేందుకు ఆస్కారముందని భారత క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు.

Updated : 13 Nov 2021 07:27 IST

దిల్లీ: మానసికంగా అలసిపోయానని అనిపించినప్పుడు.. బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని కోరుకున్నప్పుడు విరాట్‌ కోహ్లి కెప్టెన్సీని పూర్తిగా వదిలిపెట్టేందుకు ఆస్కారముందని భారత క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. ‘‘టెస్టు క్రికెట్లో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని భారత్‌ జట్టు గత అయిదేళ్లుగా నంబర్‌వన్‌గా ఉంది. తాను మానసికంగా అలసిపోయానని అనిపించినప్పుడు లేదా బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని భావించినప్పుడు సమీప భవిష్యత్‌లో కోహ్లి కెప్టెన్సీని పూర్తిగా విడిచిపెట్టే అవకాశాలను కొట్టి పారేయలేం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇదే జరిగింది. టెస్టు కెప్టెన్సీపై దృష్టి సారించడం కోసం అతడు టీ20 సారథ్యాన్ని వదులుకున్నాడు. త్వరలో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు పూర్తిగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చేమో. కోహ్లి మాత్రమే కాదు ఎంతో విజయవంతమైన క్రికెటర్లు.. బ్యాటింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు సారథ్యాన్ని వదిలేశారు. అయితే టెస్టు క్రికెట్లో కోహ్లి ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చు’’ అని శాస్త్రి పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని