PAK vs SL: హైదరాబాద్‌లో చివరి మ్యాచ్‌.. పాకిస్థాన్‌పై కుశాల్ మెండిస్ మెరుపు సెంచరీ

ప్రపంచకప్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో చివరి మ్యాచ్‌ జరుగుతోంది. పాకిస్థాన్‌, శ్రీలంక ఈ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన లంక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇస్తోంది.

Updated : 10 Oct 2023 16:26 IST

హైదరాబాద్‌: ప్రపంచకప్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో చివరి మ్యాచ్‌ జరుగుతోంది. పాకిస్థాన్‌, శ్రీలంక ఈ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన లంక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు గట్టి పోటీ ఇస్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 29 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్ కుశాల్ మెండిస్ (122; 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌లు) పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 40 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతడు మరో 25 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు.

హసన్‌ అలీ వేసిన 29 ఓవర్‌లో మూడు, నాలుగు బంతులకు వరుసగా రెండు సిక్సర్లు బాదిన కుశాల్.. తర్వాతి బంతికే ఇమాన్‌ ఉల్‌ హక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సధీరా సమరవిక్రమ (36*; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) నిలకడగా ఆడుతున్నాడు. అసలంక (0*) క్రీజులో ఉన్నాడు. ఓపెనర్ పాథుమ్ నిశాంక (51; 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ కుశాల్ పెరీరా (0) విఫలమయ్యాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని