ICC : పురుషుల క్రికెట్‌ ఎఫ్‌టీపీ.. ఆసీస్‌తో భారత్‌ 5-టెస్టుల సిరీస్‌లు

నిన్న మహిళల క్రికెట్‌ భవిష్యత్‌ పర్యటనల కార్యాచరణ (ఎఫ్‌టీపీ)ను విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. తాజాగా  పురుషుల క్రికెట్‌కు సంబంధించిన...

Updated : 17 Aug 2022 15:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: నిన్న మహిళల క్రికెట్‌ భవిష్యత్‌ పర్యటనల కార్యాచరణ (ఎఫ్‌టీపీ)ను విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. తాజాగా  పురుషుల క్రికెట్‌కు సంబంధించిన ఎఫ్‌టీపీని ప్రకటించింది. 2023-27కు సంబంధించి భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇరు దేశాల వేదికగా రెండుసార్లు 5 - టెస్టుల సిరీస్‌లను ఐసీసీ నిర్వహించనుంది. 1992 తర్వాత తొలిసారి టీమ్‌ఇండియా-ఆసీస్‌ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుండటం విశేషం. ఇప్పటికే ఐదు టెస్టులతో కూడిన యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌-ఇంగ్లాండ్‌ టీమ్‌లు తలపడుతున్న విషయం తెలిసిందే.

నాలుగేళ్ల కాలంలో (2023-27) మొత్తం 12 జట్లు కలిపి 777 అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లను ఆడతాయి. ఇందులో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టీ20లు ఉన్నాయి. వన్డే ఫార్మాట్‌ ప్రాభవం కోల్పోతుందని.. మ్యాచ్‌లు తగ్గించాలని పలువురు చెబుతున్న వేళ.. ఐసీసీ కుదించకపోవడం విశేషం. ఎఫ్‌టీపీలో రెండు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లు, రెండు వన్డే ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ ఉన్నాయి. అయితే.. పాక్‌తో భారత ద్వైపాక్షిక సిరీస్‌లకు ఇందులో చోటు కల్పించలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని