virat kohli: నా ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటంటే?: విరాట్‌

విరాట్‌ కోహ్లీ తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 

Published : 01 Oct 2022 02:25 IST

దిల్లీ: ఫామ్‌ కోల్పోయాడన్న విమర్శలకు చెక్‌ పెడుతూ ఇటీవల తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్న విరాట్‌ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌ కోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టాడు. తనకు దొరికిన విరామాన్ని ఫిట్‌నెస్‌ కోసం వినియోగించుకుంటున్నాడు. సరికొత్త ఉత్సాహంతో కనపడుతున్న ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ తాజాగా తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 

‘‘ నా ఫిట్‌నెస్‌లో అత్యంత ముఖ్యమైనవి, తక్కువగా చేసేవి ఇప్పుడు రొటీన్‌ అయ్యాయి. అవే ఫోమ్‌ రోలింగ్‌, ట్రిగ్గర్‌ పాయింట్‌ రిలీజ్‌. ఈ రెండూ గేమ్‌ఛేంజర్స్‌’’ అంటూ జిమ్‌లో చెమటోడుస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ రెండు వ్యాయామాలు తనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపాడు. కొంత కాలం ఆట నుంచి విరామం తీసుకున్న కోహ్లీ ఆ తర్వాత ఆసియా కప్‌లో రెట్టింపు ఉత్సాహంతో కనిపించాడు. సెంచరీ కొట్టి తానేంటో నిరూపించాడు. హైదరాబాద్‌ వేదికగా ఆసీస్‌తో   జరిగిన కీలక పోరులో అర్ధసెంచరీతో  చెలరేగి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని