
అతడికి గొప్ప భవిష్యత్ ఉంది: లక్ష్మణ్
ఇంటర్నెట్‌డెస్క్: కంగారూల గడ్డపై అరంగేట్రం అంటే ఓ ఘనతగా భావిస్తుంటారు. అందులోనూ టెస్టు ఫార్మాట్‌లో తొలి మ్యాచ్ అంటే గర్వంగా ఫీలవుతుంటారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా భీకర పేసర్లను ఎలా ఎదుర్కోవాలన్న కంగారు, బెదురు కూడా ఉంటాయి. కానీ యువఓపెనర్ శుభ్‌మన్ గిల్‌లో అలాంటిదేమీ కనిపించలేదు. బౌలర్లను ఆత్మవిశ్వాసంతో సమర్థవంతంగా ఎదుర్కొంటూ నిలకడగా పరుగులు సాధిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా గిల్‌ను కొనియాడాడు. మూడు ఫార్మాట్లలో అతడికి గొప్ప భవిష్యత్ ఉంటుందని ట్వీట్ చేశాడు.
‘‘కెరీర్‌లో రెండో టెస్టు మ్యాచే ఆడుతున్నప్పటికీ సిడ్నీ పిచ్‌పై ఎలాంటి తడబాటు లేకుండా పరుగులు చేస్తున్నాడు. చక్కని డిఫెన్స్, సానుకూల ధోరణీతో స్ట్రోక్‌ప్లే, షాట్ల ఎంపికపై స్పష్టత అతడి సొంతం. భారత్ తరఫున అన్నిఫార్మాట్లలో అతడికి కచ్చితంగా గొప్ప భవిష్యత్ ఉంటుంది’’ అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. బాక్సింగే టెస్టుతో గిల్ సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ టెస్టులో 45, 35* పరుగులు చేశాడు. ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించాడు. రోహిత్ (26)తో కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. కాగా, రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 96/2తో నిలిచింది. ఆసీస్ కంటే ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 338 పరుగులు చేసింది.
ఇదీ చదవండి
200+ డాడీ హండ్రెడ్ అయితే 300+ ఏంటి?
ఫుట్‌వర్క్‌లో వేగం పెంచి.. అశ్విన్‌పై ఒత్తిడి పెంచా
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.