ICC - ODI WC 2023: వన్డే వరల్డ్‌ కప్‌.. ఐసీసీ జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లకు స్థానం!

వరల్డ్ కప్‌లో ఆడిన ఆటగాళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అత్యుత్తమ జట్టును ఎంపిక చేసింది. అందులో ఆరుగురు భారత ఆటగాళ్లకు స్థానం దక్కడం విశేషం. 

Updated : 20 Nov 2023 15:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన ఆటగాళ్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా వెల్లడించింది. అందులో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లే కావడం విశేషం. వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ విజేతగా నిలిచి ఆరో టైటిల్‌ను సొంతం చేసుకుంది.  ఆ జట్టును కేవలం ఇద్దరికి మాత్రమే ఐసీసీ చోటు కల్పించింది. ఇక పన్నెండో ఆటగాడిగా దక్షిణాఫ్రికా పేస్‌ సంచలనం గెరాల్డ్‌ కొయిట్జీని ఎంపిక చేసింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేయడం విశేషం.

ఐసీసీ ‘టీమ్‌ ఆఫ్ ది టోర్నమెంట్’ ఇదే..

  • క్వింటన్‌ డికాక్‌ (దక్షిణాఫ్రికా): 10 మ్యాచుల్లో 594 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి. 
  • రోహిత్ శర్మ (భారత్): 11 మ్యాచుల్లో 597 పరుగులు చేశాడు. ఒక సెంచరీ ఉంది.
  • విరాట్ కోహ్లీ (భారత్): టోర్నీలోనే టాప్ స్కోరర్. 11 మ్యాచుల్లో 765 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. 
  • డారిల్ మిచెల్ (న్యూజిలాండ్): కివీస్‌ టాప్‌ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 10 మ్యాచుల్లో 552 పరుగులు సాధించాడు. రెండు సెంచరీలు నమోదు చేశాడు. 
  • కేఎల్ రాహుల్ (భారత్): భారత మిడిలార్డర్‌లో కీలక ఆటగాడు. 11 మ్యాచుల్లో 452 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది.
  • గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా): డబుల్ సెంచరీ చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ 9 మ్యాచుల్లో 400 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ ఆరు వికెట్లు పడగొట్టాడు.
  • రవీంద్ర జడేజా (భారత్): స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ టోర్నీలో 20 వికెట్లు తీశాడు.
  • దిల్షాన్‌ మదుషంక (శ్రీలంక): సంచలన యువ బౌలర్‌ టోర్నీలో అదరగొట్టాడు. కేవలం 9 మ్యాచుల్లోనే 21 వికెట్లు పడగొట్టాడు. భారత్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
  • ఆడమ్‌ జంపా (ఆస్ట్రేలియా): ఈ ఆసీస్‌ స్పిన్నర్‌ 11 మ్యాచుల్లో 23 వికెట్లు తీశాడు. మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌.
  • జస్‌ప్రీత్‌ బుమ్రా (భారత్): భారత స్టార్‌ పేసర్ బుమ్రా ఈ వరల్డ్ కప్‌లో 20 వికెట్లు పడగొట్టాడు.
  • మహమ్మద్ షమీ (భారత్): సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కకావికలం చేశాడు. టాప్‌ వికెట్‌ టేకర్‌ కూడా షమీనే. కేవలం 7 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీశాడు. 
  • గెరాల్డ్ కొయిట్జీ (దక్షిణాఫ్రికా): ఇతడిని ఐసీసీ 12వ ఆటగాడిగా ఎంపిక చేసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ కొయిట్జీ 8 మ్యాచుల్లో 20 వికెట్లు తీశాడు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని