SRH vs PBKS: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

మరి కాసేపట్లో షార్జా వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

Published : 25 Sep 2021 19:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరి కాసేపట్లో షార్జా వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడబోతున్నాయి. టాస్ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లూ పేలవ ప్రదర్శనే చేశాయి. తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ కింగ్స్‌..మూడు విజయాలు సాధించి ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా.. ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ ఒకే ఒక్క విజయం సాధించి ఏడు ఓటములను మూటగట్టుకుంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు..
కేన్‌ విలియమ్సన్‌, డేవిడ్‌ వార్నర్‌, సాహా, మనీశ్ పాండే, కేదార్‌ జాదవ్‌, అబ్దుల్ సమద్‌, హోల్డర్‌, రషీద్‌ఖాన్‌, భువనేశ్వర్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌

పంజాబ్ కింగ్స్ జట్టు..
కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్‌, గేల్‌, మార్‌క్రమ్‌, పూరన్‌, దీపక్ హుడా,  రవిబిష్ణోయ్‌, షమి, హర్‌ప్రీత్‌ బ్రర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, నాథన్ ఎలిస్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని