ICC: టీ20 టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్

2023వ సంవత్సరంలో అద్భుత ప్రదర్శన ఆటగాళ్లతో ఐసీసీ ఓ జట్టును ప్రకటించింది. దానికి కెప్టెన్‌గా భారత స్టార్‌ బ్యాటర్ సూర్య కుమార్‌ ఉండటం విశేషం.

Published : 22 Jan 2024 17:29 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20ల్లో గతేడాది అత్యుత్తమ ప్రదర్శన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. టాప్‌ ర్యాంకర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను (Surya Kumar Yadav) ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఐసీసీ వెల్లడించింది. ఆసీస్‌, దక్షిణాఫ్రికా జట్లతో టీ20 సిరీస్‌ల్లో భారత్‌ను సూర్య అద్భుతంగా నడిపించాడు. ఐసీసీ జట్టులో భారత్‌ నుంచి మరో ముగ్గురికి స్థానం లభించింది. యువ సంచలనం యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. 

గతేడాది సూర్యకుమార్‌ యాదవ్ 18 మ్యాచుల్లో 733 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలూ ఉన్నాయి. ఓపెనర్‌గా వస్తున్న యశస్వి జైస్వాల్ 15 మ్యాచుల్లో 430 పరుగులు సాధించాడు. ఆరంభంలో దూకుడైన ఆటతీరుతో అద్భుత శుభారంభం ఇస్తున్నాడు. రవి బిష్ణోయ్‌ ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టేసి ఐసీసీ ర్యాంకుల్లో దూసుకొచ్చాడు. ఎడమ చేతివాటం పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ గత సంవత్సరం 21 మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. 

జట్టు ఇదే: సూర్యకుమార్ యాదవ్‌ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్‌ పూరన్, మార్క్‌ చాప్‌మన్, సికిందర్‌ రజా, రామ్‌జని, మార్క్‌ ఐదెర్, రవి బిష్ణోయ్‌, రిచర్డ్‌ ఎన్‌గరవ, అర్ష్‌దీప్‌ సింగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని