Hardik Pandya: పొలార్డ్‌ వచ్చే ఏడాది మా జట్టులోకి రావాలనేది నా కోరిక.. కానీ: హార్దిక్‌ పాండ్య

మ్‌ఇండియా ఆటగాడు హార్దిక్ పాండ్య, వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరన్ పొలార్డ్‌ మంచి స్నేహితులు. వీరిద్దరూ టీ20లో లీగ్‌లో ముంబయి జట్టు తరఫున చాలాకాలంపాటు కలిసి ఆడారు. ఇదే వీరి మధ్య అనుబంధాన్ని పెంచింది.

Published : 07 May 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆటగాడు హార్దిక్ పాండ్య, వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ కీరన్ పొలార్డ్‌ మంచి స్నేహితులు. వీరిద్దరూ టీ20లో లీగ్‌లో ముంబయి జట్టు తరఫున చాలా కాలంపాటు కలిసి ఆడారు. ఇదే వీరి మధ్య అనుబంధాన్ని పెంచింది. అయితే, ఈ ఏడాది జరిగిన మెగా వేలానికి ముందు హార్దిక్‌ పాండ్యను ముంబయి అట్టిపెట్టుకోలేదు.. పొలార్డ్‌ని మాత్రం జట్టులో ఉంచుకుంది. ఈ క్రమంలో కొత్త జట్టు గుజరాత్‌.. హార్దిక్‌ పాండ్యను కెప్టెన్‌గా ఎంచుకుంది. గుజరాత్ ప్రస్తుతం టాప్‌ గేర్‌లో దూసుకుపోతుండగా.. హార్దిక్ పాండ్య పాత జట్టు ముంబయి పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. నేడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా హార్దిక్‌ పాండ్య ముంబయి జట్టుతో ఉన్న మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఇందులో భాగంగా కొన్ని రోజుల కిందట పొలార్డ్‌తో చేసిన ఫన్నీ చాటింగ్‌లోని పలు విషయాలను పంచుకున్నాడు.

‘‘ఈరోజు పొలార్డ్‌ బాగా ఆడాలి. అయితే మేము మ్యాచ్‌ గెలవాలి. నువ్వు బాగానే ఉన్నావా అంటూ తనకు నేను మెసేజ్‌లు పెడుతూ ఉంటాను. నిన్ను (పొలార్డ్) మేం చాలా మిస్‌ అవుతున్నాం అని చెప్పా. నువ్వు వచ్చే ఏడాది గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడతావేమో అని సరదాగా ఆటపట్టిస్తుంటా. అతడు గుజరాత్‌ జట్టులోకి రావాలనేది నా కోరిక. కానీ, అది ఎప్పటికీ జరగదని నాకు తెలుసు. కానీ అలా జోక్‌ చేస్తూ ఉంటా’’ అని హార్దిక్ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని