IND vs NZ: న్యూజిలాండ్‌ లక్ష్యం 540.. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 276/7 డిక్లేర్డ్‌

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా మూడో రోజు ఆటలో 276/7 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసింది.

Updated : 05 Dec 2021 14:27 IST

భారత్‌పై అజాజ్‌ పటేల్‌ అత్యుత్తమ బౌలింగ్‌..

ముంబయి‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్‌ఇండియా మూడో రోజు ఆటలో 276/7 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (62; 108 బంతుల్లో 9x4, 1x6), పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6), శుభ్‌మన్‌గిల్‌ (47; 75 బంతుల్లో 4x4, 1x6), అక్షర్‌ పటేల్‌ (41 నాటౌట్‌; 26 బంతుల్లో 3x4, 4x6) రాణించారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (36; 84 బంతుల్లో 1x4, 1x6) పరుగులు చేశాడు. చివరికి న్యూజిలాండ్‌ స్పిన్నర్లు రచిన్‌ రవీంద్ర, అజాజ్‌ పటేల్‌ క్రమంగా వికెట్లు పడగొడుతున్న వేళలోనే కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 263 పరుగులు కలుపుకొని న్యూజిలాండ్‌ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా నిర్దేశించింది. కివీస్‌ బౌలర్లలో రచిన్‌ రవీంద్ర మూడు వికెట్లు తీయగా అజాజ్‌ నాలుగు వికెట్లు తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని