IPL 2021: మనకు 80 ఏళ్లు వచ్చినా.. నీతో డ్యాన్స్‌ చేయకుండా ఉండలేను

డివిలియర్స్‌ తాజాగా తన సతీమణి డేనియెల్లీతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశాడు...

Published : 09 Oct 2021 01:59 IST

(Photo: AB de Villiers Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ ప్రస్తుతం యూఏఈలో ఎంజాయ్‌ చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి జట్టుతో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ చేరడంతో ఎలాగైనా కప్పు సాధించాలనే కసితో ఉన్నాడు. ఇదిలా ఉండగా డివిలియర్స్‌ తాజాగా తన సతీమణి డేనియెల్లీతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను అతడి సతీమణి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

‘మనకు 80 ఏళ్లు వచ్చినా నీతో కలిసి డ్యాన్స్‌ చేయకుండా ఉండలేను. కాకపోతే అప్పుడు కాస్త నెమ్మదిగా స్టెప్పులేస్తానేమో’ అని వ్యాఖ్యానిస్తూ ఆమె ఈ వీడియో పోస్టు చేశారు. దీనికి విశేష స్పందన వస్తోంది. ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సైతం లైక్‌ కొట్టారు. మరోవైపు అభిమానులు చూడముచ్చటైన జంట అంటూ కామెంట్లు పెడుతూ  సంబరపడుతున్నారు. ఆ వీడియో చూసి మీరూ ఆస్వాదించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని