Dale Steyn Retirement: దక్షిణాఫ్రికా పేస్‌ దిగ్గజం డేల్‌ స్టెయిన్‌ క్రికెట్‌కు వీడ్కోలు

దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ కొద్దిసేపటి క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2004లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతడు 2020లో  ఆస్ట్రేలియాపై చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు...

Updated : 21 Nov 2022 14:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ కొద్దిసేపటి క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2004లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతడు 2020లో  ఆస్ట్రేలియాపై చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు. అయితే, రెండు మూడేళ్లుగా గాయాలబారిన పడటంతో స్టెయిన్‌ పెద్దగా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇవాళ రిటైర్మెంట్‌ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. మొత్తం 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడిన అతడు ఎంతో మంది దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 439, వన్డేల్లో 196, టీ20ల్లో 64 వికెట్లు సాధించాడు. గత దశాబ్దంలో ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ బౌలర్లలో ఒకడిగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు 2008 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న స్టెయిన్‌ మొత్తం 95 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలోనే గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మూడు మ్యాచ్‌లాడి సన్‌రైజర్స్‌పై కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడేందుకు అతడు ఆసక్తి చూపలేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇతర లీగుల్లో కొనసాగుతున్నాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని