Axar Patel : ఎప్పటికప్పుడు నా మైండ్‌కు అలా చెప్పుకుంటుంటా: అక్షర్ పటేల్

వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో సుస్థిర స్థానం కోసం కష్టపడుతున్న భారత క్రికెటర్లలో అక్షర్‌ పటేల్ ఒకడు. తాజాగా జింబాబ్వేతో...

Published : 23 Aug 2022 15:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో సుస్థిర స్థానం కోసం కష్టపడుతున్న భారత క్రికెటర్లలో అక్షర్‌ పటేల్ ఒకడు. తాజాగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో ఆరు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. మరీ ముఖ్యంగా ఆఖరి మ్యాచ్‌లో సీన్‌ విలియమ్స్ (45)తోపాటు జింబాబ్వే కెప్టెన్‌ రెగిస్ చకబ్వా(16) వికెట్లను తీసి భారత్‌ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను రీప్లేస్‌ చేయగల ఆటగాడిగా అక్షర్‌ ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడి సడెన్‌గా పక్కన కూర్చోబెడితే చాలా కష్టంగా అనిపించేదని అక్షర్‌ పేర్కొన్నాడు. 

నిన్న జింబాబ్వేతో మ్యాచ్‌ అనంతరం అక్షర్‌ పటేల్ మాట్లాడుతూ.. ‘‘అప్పుడప్పుడు రెండు, మూడు మ్యాచ్‌లు ఆడటం ఇబ్బందిగా ఉంటుంది. అయితే బాగా ఆడేందుకు ఇదొక మంచి అవకాశం. దానిని వినియోగించుకోవాలని నా మైండ్‌కు చెప్పుకుంటుంటా. ఒక మ్యాచ్‌లో అద్భుతంగా రాణిస్తే తర్వాత మ్యాచ్‌లో ఉంటాను. నా స్కిల్స్‌ను ఇంప్రూప్‌ చేసుకుంటూనే ఉంటా’’ అని అక్షర్‌ తెలిపాడు. జింబాబ్వేతో మూడో వన్డేలో పిచ్‌ స్పిన్‌కు బాగా సహకరించిందని చెప్పాడు. స్టంప్‌లైన్‌లో బంతులను సంధించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నాడు. బ్యాటర్లు ఏవైనా తప్పులు చేస్తారేమోనని వేచి ఉంటానని వెల్లడించాడు. అదృష్టవశాత్తూ ఇన్నింగ్స్‌ 40వ ఓవర్‌లోనూ మెయిడిన్‌గా వేశానని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని