యూఎస్‌‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత ఒసాకా

జపాన్‌కు చెందిన నవోమీ ఒసాకా యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన తుదిపోరులో బెలారస్‌కు చెందిన విక్టోరియా అజెరెంకాపై అద్భుతమైన విజయం సాధించింది............

Published : 13 Sep 2020 08:25 IST

(Photo: US Open Tennis Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌కు చెందిన నవోమీ ఒసాకా యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన తుదిపోరులో బెలారస్‌కు చెందిన విక్టోరియా అజెరెంకాపై అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఒసాకా మూడు గ్రాండ్‌ స్లామ్‌లు గెలుచుకోగా.. అందులో రెండు యూఎస్‌ ఓపెన్‌ కావడం విశేషం.

(Photo: US Open Tennis Twitter)

తొలి సెట్‌లో అజెరెంకా ఆధిపత్యం కొనసాగినప్పటికీ.. తర్వాతి సెట్లలో ఒసాకా పై చేయి సాధించింది. గంటా 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఒసాకా 1-6, 6-3, 6-3 తేడాతో గెలుపొందింది. 2018లోనూ ఒసాకా యూఎస్‌ ఓపెన్‌ను గెలుచుకుంది. 2019లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. 

(Photo: US Open Tennis Twitter)

ఇవీ చదవండి..
అలెగ్జాండర్‌ అడుగేశాడు

రాజస్థాన్‌ ఆ ఒకటిని.. రెండు చేయాలని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని