
IPL 2022: ఐపీఎల్ వేలంలోలార్డ్‌కి వెల కట్టలేం.. శార్దూల్‌పై చాహల్ ఛలోక్తి
శార్దూల్, రాహుల్, చాహల్ ఫన్నీ వీడియో
ఇంటర్నెట్‌డెస్క్: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022కు సంబంధించిన మెగా వేలం జరగనుంది. దీంతో ఫ్రాంఛైజీల యాజమాన్యాల నుంచి అభిమానుల వరకూ అందరి దృష్టి క్రికెటర్లపైనే ఉంది. ఏయే ఆటగాడు ఏయే జట్టుకు ఎంపికవుతాడు.. ఎంత ధర పలుకుతాడనే విషయాలు ఆసక్తిగా మారాయి. మరోవైపు ఈ ఏడాది రెండు కొత్త జట్లు మెగా ఈవెంట్‌లో చేరడంతో మరింత మంది క్రికెటర్లకు సైతం ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కనుంది. ఈ క్రమంలోనే ఇంతకుముందు పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్.. ఇప్పుడు లఖ్‌నవూ జట్టుకు సారథిగా నియమితుడయ్యాడు. అతడిని ఆర్పీఎస్‌జీ గ్రూప్ భారీ మొత్తానికి దక్కించుకుంది.
కాగా, ఈ మెగావేలం నేపథ్యంలోనే టీమ్‌ఇండియా క్రికెటర్లు రాహుల్, శార్దూల్, యుజువేంద్ర చాహల్ ఓ సరదా సంభాషణలో పాల్గొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో ఓ హోటల్‌కు వెళ్లిన ఈ ముగ్గురు ఆసక్తికర సంభాషణ సాగించారు. తొలుత శార్దూల్ మాట్లాడుతూ.. ‘ఈసారి వేలంలో నాకోసం మీ బడ్జెట్ ఎంత?’ అని సరదాగా రాహుల్‌ను అడిగాడు. దీనికి లఖ్‌నవూ సారథి బదులిస్తూ.. ‘నీకైతే బేస్ ప్రైజ్’ అని సమాధానమిచ్చాడు. అనంతరం చాహల్ కలగజేసుకొని.. ‘దేవుడికి వెల కట్టలేం బ్రో’ అని ఓ ఛలోక్తి విసిరాడు. శార్దూల్‌ను లార్డ్ శార్దూల్ అని సంబోధించడం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఆల్‌రౌండర్ గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడగా.. చాహల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పాల్గొన్నాడు. మరి ఈసారి మెగా వేలంలో ఈ ఇద్దరు ఏ జట్లకు ఎంపికవుతారో చూడాలి.