Holder: ఈ ముగ్గురు భారత ఆటగాళ్లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ తీయడమే నా డ్రీమ్‌: హోల్డర్‌

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ కన్ను ముగ్గురు భారత క్రికెటర్లపై పడింది. ఆ ముగ్గురిని వరుస బంతుల్లోనే ఔట్ చేసి హ్యాట్రిక్‌ తీయాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు.

Published : 14 Dec 2022 12:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హ్యాట్రిక్‌.. క్రికెట్‌లో ఏ బౌలర్‌కైనా ఉండే డ్రీమ్‌. వరుస బంతుల్లో మూడు వికెట్లు తీసి సంచలనం సృష్టించాలని భావిస్తాడు. అదీ కీలక బ్యాటర్లను ఔట్‌ చేస్తే ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోతాడు. అలాంటి రికార్డును కైవసం చేసుకోవాలని వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ జాసన్ హోల్డర్‌కు ఉందట.. మరి ఇంతకీ అతడి డ్రీమ్‌ ఏంటో చూద్దాం.. 

ప్రస్తుత భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టాప్‌ ప్లేయర్లు. వీరి స్థాయి కాకపోయినా కేఎల్ రాహుల్‌ కూడా ఉత్తమ ఆటగాడే. ఈ ముగ్గురిని ఔట్‌ చేసి.. అదీనూ వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చి హ్యాట్రిక్‌ సాధించాలని ఉందని జాసన్‌ హోల్డర్‌ తెలిపాడు.

‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. వీరిని ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించాలని ఉంది. అలాగే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌. అతడికి బౌలింగ్‌ చేయడం నాకెప్పుడూ సవాలే. అది టెస్టులు, వన్డేలు, టీ20లు ఏదైనా సరే ఏబీడీ డేంజరస్ ఆటగాడు’’ అని ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ జాసన్ హోల్డర్‌ వెల్లడించాడు. భారత టీ20 లీగ్‌కు గతంలో హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన హోల్డర్‌.. మెగా వేలం తర్వాత లక్‌నవూకి వెళ్లిపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని