Chahal: ధనశ్రీ డ్యాన్స్.. చాటుగా చూస్తున్న చాహల్
టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తుంటాడు. అతని భార్య ధనుశ్రీ వర్మకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన
(photo:Yuzvendra Chahal Twitter)
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తుంటాడు. అతని భార్య ధనశ్రీ వర్మకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆమె మంచి డ్యాన్సర్ కూడా. యూ ట్యూబర్‌గానూ ఫేమస్. ఆమె తరుచూ తాను డ్యాన్స్ చేస్తున్న వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. ఇటీవల ఆర్సీబీ జెర్సీ వేసుకుని డ్యాన్స్ చేసి అలరించిన ధనశ్రీ... తాజాగా మరో రెండు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.
ఈ రెండు వీడియోల్లో ఒకే రకమైన డ్రెస్‌లో, ఒకే ప్రదేశంలో, ఒకే రకమైన డ్యాన్స్‌తో అలరించింది ధనశ్రీ. కానీ మొదట పోస్టు చేసిన వీడియోకి రెండోసారి పోస్టు చేసిన వీడియోని పరిశీలిస్తే ఓ తేడా కనిపిస్తోంది. అదేంటంటే రెండో వీడియోలో చాహల్ పరదా చాటున ఉండి తన రెండు పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ ధనశ్రీ చేస్తున్న డ్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేశాడు. అయితే, మొదటి వీడియో పోస్టు చేసినప్పుడే ఇందుకు సంబంధించిన హింట్ ఇచ్చింది ధనశ్రీ. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను మీరు కూడా చూసేయండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!
-
Asian Games: అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్