శివశంకర్‌ మాస్టర్‌ కుటుంబానికి చిరంజీవి రూ.3 లక్షల సాయం

కొవిడ్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ప్రముఖ నృత్యదర్శకుడు శివశంకర్‌ మాస్టర్‌ కుటుంబానికి రూ.3 లక్షల సహాయాన్ని సినీనటుడు చిరంజీవి ...

Published : 27 Nov 2021 04:06 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ప్రముఖ నృత్యదర్శకుడు శివశంకర్‌ మాస్టర్‌ కుటుంబానికి రూ.3 లక్షల సహాయాన్ని సినీనటుడు చిరంజీవి శుక్రవారం అందజేశారు. మాస్టర్‌, ఆయన పెద్దకుమారుడు ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. భార్య హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. విషయం తెలిసిన చిరంజీవి.. శివశంకర్‌ చిన్న కుమారుడు అజయ్‌కు చెక్కు అందజేశారు. అండగా ఉంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని