లాండ్రీ స్పాట్‌ సంస్థకు జరిమానా

ఫెమా చట్టం నిబంధనల్ని ఉల్లంఘించినందుకు లాండ్రీ స్పాట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ డైరెక్టర్‌, ప్రవాస భారతీయుడికి చెందిన రూ.1.76 కోట్ల విలువైన 4.26 ఎకరాల వ్యవసాయ భూమిని ఈడీ శుక్రవారం జప్తు

Published : 04 Dec 2021 05:14 IST

ఫెమా చట్టం నిబంధనల్ని ఉల్లంఘించినందుకు లాండ్రీ స్పాట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ డైరెక్టర్‌, ప్రవాస భారతీయుడికి చెందిన రూ.1.76 కోట్ల విలువైన 4.26 ఎకరాల వ్యవసాయ భూమిని ఈడీ శుక్రవారం జప్తు చేసింది. సంస్థ నిర్వాహకులకు రూ.21.96 లక్షల జరిమానా విధించింది. 2016లో ఓ ప్రవాస భారతీయుడి నుంచి రూ.2.66 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకోవడంలో సంస్థ ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని